హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్

SRPT: SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో ఉచిత ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు. సూర్యాపేటలోని చుక్కా రామయ్య పాఠశాలలో, కోదాడలోని కేఆర్‌ఆర్ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు మొత్తం 497 మంది అభ్యర్థులు హాజరయ్యారు.