హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌కు చేరుకున్న నశా ముక్త్ భారత్ సైకిల్ యాత్ర

NRML: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3000 కి.మీ సైకిల్ యాత్ర చేస్తున్న 63 ఏళ్ల ఐ.విజయలక్ష్మి నిర్మల్‌కు చేరుకున్నారు. నిర్మల్‌లో నిన్న రాత్రి బస చేసిన ఆమెకు పోలీసులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవితం గడపాలని ఆమె సందేశం ఇచ్చారు. ఆమె సంకల్పానికి అందరూ అభినందనలు తెలిపారు.