హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాజిగిరిలో కల్తీ కల్లుపై DTF బృందాల తనిఖీలు

మల్కాజ్‌గిరి జిల్లాలో ఎక్సైజ్ DTF బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో క్లోరల్ హైడ్రేట్ కలిపిన 163 లీటర్లు, నాచారం అశోక్ నగర్‌లో 101 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.