హైదరాబాద్: 28°C
తెలంగాణ

పడకల్‌లో 29 మందికి కొత్త పింఛన్లు

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఆసరా, గీత కార్మిక, ఒంటరి మహిళల పింఛన్లు మంజూరయ్యాయి. ఆమనగల్లు లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగిందని సర్పంచ్ సునీత హర్షం వ్యక్తం చేశారు.