హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండగోకిరి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన MPDO

ASR: కొయ్యూరు మండలం కొండగోకిరిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం ఎంపీడీవో ప్రసాదరావు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.