హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సామూహిక కుంకుమార్చన

SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.