హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల వీరంగం.. బాలికకు తీవ్ర గాయాలు

JGL: రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్‌లో ఆదివారం వీధి కుక్కలు రెచ్చిపోయాయి. నాలుగేళ్ల రిశ్వికపై దాడి చేయడంతో ముఖం, కుడికన్ను వద్ద తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అడ్డుకునేందుకు వెళ్లిన రాజు అనే యువకుడికీ సైతం గాయాలయ్యాయి. వెంటనే వారికి రాయికల్‌లో ప్రథమ చికిత్స చేసి అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.