హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల చొరవతో గంటలోనే బాలుడి ఆచూకీ

ELR: కొయ్యలగూడెం మార్కెట్‌లో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు ప్రజ్విష్‌ను పోలీసులు గంటలోపే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అంకాలగూడెం గ్రామానికి చెందిన వినోద్‌ కూరగాయల కోసం కుమారుడితో మార్కెట్‌కు రాగా బాలుడు కనిపించకుండా పోయాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై చంద్రశేఖర్‌ సిబ్బందితో గాలించి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.