PPM: సాలూరులో పాత తాగునీటి పైపుల కారణంగా లీకేజీల సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన సరఫరా కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో పైపులు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. రోడ్లపై నీరు నిలిచి గుంతలు ఏర్పడుతుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నీటి పథకం పూర్తయితే లీకేజీల సమస్యకు పరిష్కారం లభిస్తుందని పురపాలక డీఈ ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పైపుల లీకేజీలు.. రహదారులపై నిలుస్తున్న నీరు


