హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా పతనమైన బంగారం రేట్లు

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. మార్కెట్‌లో వారం వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. గత ఆదివారం(నవంబర్ 8) 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,570 ఉండగా, ఇవాళ రూ.1,37,620కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,600 నుంచి ఈరోజు రూ.1,26,150కి చేరుకుంది. మరోవైపు కిలో వెండి కూడా నవంబర్ 8వ తేదీన రూ.2,05,000గా ఉండగా.. వారంలో ఏకంగా రూ.10 వేలు తగ్గి రూ.1,95,000 వద్ద కొనసాగుతోంది.