హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు

SRCL: ఎల్నినో ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు మండలంలో ముందస్తు అనుమతి లేకుండా బోర్లు వేయరాదని తహశీల్దార్ వరలక్ష్మి తెలిపారు. వాల్టా చట్టం-2002 నిబంధనలు ఉల్లంఘించి బోర్లు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు, ప్రజలు నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు.