హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక పుణ్యస్నానాల వద్ద భక్తులు జాగ్రత్త!

AKP: కార్తీక మాసంలో ఆలయాలు, నదీ, సముద్ర తీరాలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం సూచించారు. స్నాన ఘట్టాల వద్ద హెచ్చరిక బోర్డులు గమనిస్తూ లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా సురక్షితంగా స్నానాలు చేయాలన్నారు. రద్దీలో చిన్నారులను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ, గజ ఈతగాళ్లు, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.