VZM: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీ సాధించారని టీడీపీ నేత మజ్జి శ్రీను అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతం కంటే స్థానిక ఎన్నికల్లో మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని తెలిపారు. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'2029లోనూ కూటమి ప్రభుత్వానిదే అధికారం'


