SKLM: పాతపట్నం ఆదివాసీ భవనంలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి, జిల్లా అధ్యక్షులు గురడి అప్పన్న బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడు బిర్సా ముండా అని యోగి అన్నారు. అడవి, భూమి హక్కుల కోసం పోరాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాతపట్నంలో బిర్సా ముండా జయంతి వేడుకలు


