హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో రైలు కిందపడి వ్యక్తి మృతి

GNTR: తెనాలి రైల్వే స్టేషన్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ సరస్వతి తెలిపారు.