హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓఆర్ఆర్ భూసేకరణకు కేంద్రం కొత్త గెజిట్

GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఆరు లైన్ల నిర్మాణానికి భూసేకరణపై కేంద్రం నవంబర్ 5న గెజిట్ విడుదల చేసింది. పల్నాడు జిల్లాలో 0.000 నుంచి 189.900 కి.మీ వరకు భూములు సేకరించనున్నారు. అభ్యంతరాలు ఉన్నవారు 21 రోజుల్లోగా పల్నాడు జాయింట్ కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలపాలి. విచారణ తర్వాత సెక్షన్ 3C(2) కింద ఇచ్చే ఆదేశాలే తుది నిర్ణయం.