హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిగడపలో జనసేనకు సీట్ల చిచ్చు

కృష్ణా: తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 48 వార్డులకు జనసేనకు కేవలం 12 స్థానాలే కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి బలహీనంగా ఉండి, YCPకి అనుకూలంగా ఉన్న వార్డులనే జనసేనకు ఇచ్చారని, బలమున్న యనమలకుదురు, తాడిగడప, డొంకరోడ్డు ప్రాంతాల్లో తక్కువ సీట్లు ఇచ్చారంటున్నారు. సీట్ల కోసం జనసేన నాయకులు 2 వర్గాలుగా విడిపోయి నేరుగా కొట్టుకునే వరకు వెళ్లారని సమాచారం.