హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 10 నామినేషన్లు దాఖలు

శ్రీకాకుళం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. మేయర్ పదవికి ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు సమర్పించగా, కార్పొరేటర్ స్థానాలకు వివిధ డివిజన్ల నుంచి 6 నామినేషన్లు అందినట్లు తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ విషయానికి వస్తే వార్డు సభ్యుల స్థానాలకు 2 నామినేషన్లు అందాయి.