హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మూల మలుపు

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి వెళ్లే మార్గంలో దేగాం గ్రామం వద్ద మూల మలుపు ప్రమాదకరంగా మారింది. మలుపును ఆనుకుని పెద్ద కాలువ ఉండటంతో వేగంగా వచ్చిన వాహ నాలు అదుపుతప్పితే కాలువలో పడే ఆస్కారం ఉంది. పైగా ఎటువంటి సూచికలు, రక్షణ చర్యలు లేని కారణంగా వాహనదారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు.