NDL: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 10:57 గంటల వరకు మొత్తం 43,745 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగా, వీరిలో 22,444 మంది ఉచిత క్యూలైన్ ద్వారా దర్శనం పొందారు. మరో 7,528 మంది భక్తులు ఆలయంలో అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


