VSP: గాజువాక రాజీవ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. కుండ్రపు వెంకటరామ్ చరణ్ (22) బీటెక్ విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడు. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు దువ్వాడ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


