హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుమ్మడిగుడ్డివలస రహదారి అధ్వానం!

PPM: పాచిపెంట మండలం గుమ్మడిగుడ్డివలస నుంచి కర్రివలస బస్టాండు వరకు రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆరేళ్ల క్రితం రూ.50 లక్షలతో నిర్మించిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు నాణ్యత లోపంతో మూడేళ్లకే పాడైంది. తుపానుల ప్రభావంతో పరిస్థితి మరింత దిగజారినా మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయి.