AKP: పాయకరావుపేట మేజరు పంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి తరపున టీడీపీ సీనియర్ నాయకుడు జూరెడ్డి ప్రసాద్ పేరు ఖరారైంది. సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో పలువురు నాయకులు పోటీకి ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో జూరెడ్డి ప్రసాద్ పేరును హోంమంత్రి వంగలపూడి అనిత ఖరారు చేశారు. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాయకరావుపేట సర్పంచ్ అభ్యర్థిగా జూరెడ్డి


