హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీనగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ASR: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఎండీ యాసిన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పార్వతీనగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)సిబ్బందితో పాటు డ్రోన్ సాయంతో గ్రామంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించి, రానున్న పంచాయతీ ఎన్నికలపై అవగాహన కల్పించారు.