హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కమిషనర్

NTR: విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో ఈ నెల 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై ప్రజలు తమ సమీప కార్యాలయాన్ని సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.