W.G: ఆకివీడులోని దొరగారి చెరువు వద్ద డాక్టర్ జానకమ్మ మెమోరియల్ పార్క్ నిర్మాణానికి ఆదివారం ఛైర్మన్ డాక్టర్ బిలాల్ నీలోఫర్ శంకుస్థాపన చేశారు. భావితరాలకు జానకమ్మ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచేలా పార్కును నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి ప్రసాద్, డాక్టర్ ఎంవీఎస్ రాజు, గంధం ఉమా, గణపతి, నాగరాజు, సప్ప మణికంఠ, రవి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జానకమ్మ మెమోరియల్ పార్కు శంకుస్థాపన


