హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో తొలిరోజు 7 నామినేషన్లు

WG: భీమవరం మున్సిపల్ ఎన్నికల మొదటి రోజు నామినేషన్ల పర్వంలో 52 వార్డులకు గాను మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో CPM నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులుగా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఛైర్మన్ అభ్యర్థులకు మాత్రం తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు.