హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సైక్లిస్ట్‌ను ఢీకొట్టిన కారు

నంద్యాల-చాబోలు మెట్ట హైవే సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న చాబోలు గ్రామానికి చెందిన సుమంత్‌ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.