హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు చదరంగం పోటీలు

శ్రీకాకుళం నగరంలోని గుజరాతిపేట పీ.ఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్లో నేడు అండర్ 9, 15 విభాగాల్లో జిల్లా చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు చెస్ స్కూల్స్ కన్వీనర్ భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు నగదు పురస్కారం అందజేస్తామని ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనాలని ఆయన సూచించారు. వివరాలకు 9912559735 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.