హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులు, ఆక్వా రైతులకు హెచ్చరిక...!

నెల్లూరు: బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే సూచనల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రం, రిజర్వాయర్లు నదుల్లో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్య శాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలన్నారు. వేట పరికరాలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలన్నారు.