SRD: జిన్నారం మండలం శివానగర్ నుంచి కంజర్ల చౌరస్తా వరకు రహదారిపై ప్రయాణం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. గుంతలతో నిండిన రోడ్డుపై వాహనాలు వెళ్లిన ప్రతిసారీ భారీగా దుమ్ము లేస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.
తెలంగాణ
శివానగర్ రహదారిపై దుమ్ముతో ఇబ్బందులు


