హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు

కోనసీమ: జిల్లాలో కార్తీక మాసం ప్రభావంతో ఆదివారం చికెన్ ధరలు గత వారం నుంచి భారీగా తగ్గాయి. ఫారం కోడి రిటైల్ లైవ్ కిలో రూ.113-115, మాంసం 220-225, బ్రాయిలర్ రూ.136-138, స్కిన్ లెస్ రూ.270-275 విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.700-800, చేపలు కిలో రూ. 130-145 పలుకుతున్నాయని, ప్రాంతాలను బట్టి మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.