హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం స్వర్ణ గ్రామానికి మార్పు

KRNL: దేవనకొండ మండలం ఈదులదేవబండ ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సాంకేతిక కారణాలతో స్వర్ణ గ్రామానికి మార్చినట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. పి.కోటకొండ, నెల్లిబండ, మాచాపురం గ్రామాల అభ్యర్థులు స్వర్ణలో నామినేషన్లు దాఖలు చేయాలని MPDO సూచించారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని ఆమె కోరారు.