ప్రకాశం: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎరువుల విక్రయ విధానంపై కురిచేడులో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సంపత్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఎరువుల డీలర్లకు FFS యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆధార్ ధ్రువీకరణ, ఎరువుల బుకింగ్, క్యూఆర్ కోడ్ విధానాన్ని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన ఎరువుల విధానంపై అవగాహన


