హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి'

కరీంనగర్ జిల్లాలోని ఎలబోతారం, ఫకీర్పేట్, బహదూర్ఖాన్పేట్, దుబ్బపల్లి, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసన్న పటేల్ శనివారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.