హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో డెలివరీకి వచ్చిన గర్భిణీ మృతి

NTR; తిరువూరులోని వైష్ణవి హాస్పిటల్‌లో డెలివరీ ఆపరేషన్ అనంతరం 22 ఏళ్ల మన్నెం నాగలక్ష్మి మృతి చెందారు. బుధవారం ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, నూతిపాడు గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య రిపోర్టులు ఇవ్వకుండా ఆసుపత్రి సిబ్బంది తమను పంపించేందుకు ప్రయత్నించారని బాధితులు తెలిపారు.