హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ రూట్‌లో పునఃప్రారంభమైన రాకపోకలు

NZB: మనోహరాబాద్ వద్ద డబ్లింగ్ పనుల్లో భాగంగా చేపట్టిన నాన్‌ ఇంటర్‌లాకింగ్ పనులు పూర్తికావడంతో రద్దు చేసిన కాచిగూడ–నిజామాబాద్ (77601), నిజామాబాద్–కాచిగూడ (77602) రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి శ్రీధర్ శనివారం తెలిపారు. ఈ రైళ్లు ఇకపై పాత సమయాల ప్రకారమే నడవనున్నాయని పేర్కొన్నారు.