హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.5.85 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

BHNG: రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో రోడ్లు, భవనాల శాఖ నిధులు రూ.5.85 కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు, రహదారి నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ రంగ నరేష్ గౌడ్ ప్రారంభించారు. గ్రామంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.