హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగదు, మద్యంపై ముమ్మర తనిఖీలు చేయాలి: కమిషనర్

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎంసీసీ అమలులో ఎఫ్ఎస్ఈ, ఎస్ఎసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం నాలుగు ప్రత్యేక బృందాల సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. నగదు, మద్యం, ప్రలోభపరిచే వస్తువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు.