హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో డీఎంహెచ్‌వో బదిలీ

SRPT: సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బదిలీ అయ్యారు. ఆయన్ను హైదరాబాద్‌లోని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నూతన అధికారి నియామకంపై త్వరలో స్పష్టత రానుంది.