హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆసక్తి ఉంటే 1-12 తరగతులు పెట్టుకోవచ్చు'

TG: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఆసక్తి ఉంటే 1-12 తరగతుల వరకు నిర్వహించుకోవచ్చని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష తెలిపారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం అనుమతులు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల కోసమే పాఠశాల విద్యలో ఇంటర్‌ను విలీనం చేయాలని నిర్ణయించినట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో భేటీలో తెలిపారు.