హైదరాబాద్: 28°C
వార్తలు

20 నుంచి యాదాద్రిలో కార్తీక ఉత్సవం

TG: యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు కార్తీక మహోత్సవం నిర్వహించనున్నారు. 20న కోటి పుష్పార్చన ఉత్సవం, ఆధ్యాత్మిక ప్రవచనం, భక్తీ సంగీత కార్యక్రమం, 21న ప్రత్యేక సంగీత విభావరి, 22న ప్రత్యేక శాస్త్రీయ నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.