హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఫిలిప్పీన్స్‌లో మోదీ పర్యటన

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రధాని మోదీ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు మోదీ వెళ్తున్నారు. రేపు జరగనున్న 23వ ఆసియాన్-భారత శిఖరాగ్ర సమావేశం, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. భారత్, ఆసియాన్ దేశాలు 2026వ సంవత్సరాన్ని 'ఆసియాన్-భారత సముద్ర సహకార సంవత్సరంగా' జరుపుకుంటున్నందున ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.