హైదరాబాద్: 28°C
వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా, ఈనెల 18, 19 తేదీల్లో ఒడిశా, కోస్తాంధ్రలోనూ భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్లను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.