హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌడపూర్ మండలంలో పెరిగిన చలి తీవ్రత

VKB: చౌడపూర్ మండలంలోని గ్రామాల్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రివేళల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు గుంపులుగా చేరి చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం వేళల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు చలి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.