హైదరాబాద్: 28°C
తెలంగాణ

సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా శ్రీనివాస్ నియమకం

KNR: హుజూరాబాద్ మండలం కనుకులగిద్దికి చెందిన శ్రీనివాస్ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు.రాష్ట్ర సంఘం కార్యవర్గం ఆమోదించిన తీర్మానం మేరకు అధ్యక్షుడు శేఖర్,ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం ఈ నియామకాన్ని ప్రకటించారు. గతంలో జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించారు.