కృష్ణా: గుడివాడలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడిన ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు టూ టౌన్ సీఐ హనీష్ తెలిపారు. రైలుపేటకు చెందిన పల్లి ఖాదర్ వలీ(38) దొంగతనానికి పాల్పడటంతో తహశీల్దార్ ఆరు నెలల రిమాండ్ విధించారు. గతంలో బొమ్ములూరుకు చెందిన మెండ నాగరాజు కూడా నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.లక్ష జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
ఒకరికి రిమాండ్.. మరొకరికి జరిమానా


