హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోన్‌తోనే ఆయిల్‌పామ్ సాగునీరు

SRCL: ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతు బాగిశెట్టి శ్రీనివాస్ 15 ఎకరాల ఆయిల్‌పామ్ తోటకు సెల్‌ఫోన్ ద్వారా నీరు పారిస్తున్నారు. మూడు బోర్లకు, మూడు విభాగాల వాల్వ్‌లను అనుసంధానించే ఆటోమేషన్ వ్యవస్థను సుమారు ఏడాది కిందట రూ.10 లక్షలతో ఏర్పాటు చేశారు. దీంతో కూలీల శ్రమ, సమయం, విద్యుత్ వృథా తగ్గి నీటి నిర్వహణ సులభమైందని ఆయన తెలిపారు.