కోనసీమ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సఖినేటిపల్లిలో 144 సెక్షన్ CRPC, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నాయని ఎస్సై హరికోట శాస్త్రి తెలిపారు. ప్రజలు గుంపులుగా తిరగడం, అల్లర్లు సృష్టించడం వంటివి చేయరాదని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సఖినేటిపల్లిలో 144 సెక్షన్ అమలు: ఎస్సై


