హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవం

BDK: ఆళ్లపల్లి మండలంలోని సంది బంధం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెల్లం సంధ్య కుమారి, పంచాయతీ కార్యదర్శి జబ్బార్ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలల భవిష్యత్తుకు విద్య ఎంతో ముఖ్యమని, ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.